Venkatesh's Drishyam Movie Review in Telugu (దృశ్యం రివ్యూ)

బేనర్: సురేష్ ప్రొడక్షన్స్ ,రాజ్ కుమార్ ధియేటర్స్
కధ: జీతూ జోసఫ్
మాటలు: పరుచూరి బ్రదర్స్,డార్లింగ్ స్వామి
సినిమాటోగ్రఫీ: ఎస్.గోపాలరెడ్డి
నిర్మాతలు: సురేష్ బాబు,రాజ్ కుమార్ సేతుపతి
దర్శకత్వం: శ్రీ ప్రియ



సినిమా గురించి:

మలయాళం లో సూపర్ హిట్ అయిన సినిమా అయినా తెలుగులో తీసేటపుడు ఇక్కడి జనం ఆదరిస్తారా అనే భయం ఖచ్చితంగా ఉండి  తీరుతుంది.ఆ భయాలన్నిటిని పటాపంచలు చెయ్యగల సత్తాఉన్న సినిమా దృశ్యం.వెంకటేష్ ఒక మామూలు మధ్యతరగతి కుటుంబ యజమాని పాత్ర పోషించారు.పేరు రాంబాబు.పెద్దగా ఆస్తిపాస్తులు లేకపోయినా  చక్కని ఇల్లు,అర్డంచేసుకునే భార్య,ఇద్దరు ఆడపిల్లలు వీళ్ళే అతని ఆస్తిగా జీవనం సాగిస్తుంటాడు.కేబుల్ టి.వి ఆపరేటర్ గా ఉండటంవల్ల  సినిమాలు చూడడం అతనికి అత్యంత ఇష్టమైన వ్యాపకంగా మారిపోతుంది.ఇలా ఆఫీస్ లో సినిమాలు,ఇంట్లో పిల్లలు భార్య తో ఆనందంగా సాగిపోతున్న రాంబాబు జీవితంలో అనుకోని సంఘటలు ఎదురవుతాయి.రాంబాబు భార్య,పెద్ద కూతురు ఒక మర్డర్ కేసులో ఇరుక్కుంటారు.తన కుటుంబాన్ని కాపాడుకోడానికి రాంబాబు పడ్డ కష్టమే దృశ్యం.సాధారణ గృహిణి గా,తన భర్తకు అండగా మీనా నటన ఆకట్టుకుంటుంది.ప్రతీ మధ్య తరగతి వాళ్ళు తమనుతాము చూసుకునే చిత్రం ఇది.

                                       కధగా చిన్నదిగా ఉన్నా ఆద్యంతం ఉత్కంట కలిగించే చిత్రం దృశ్యం.ఫస్ట్ హాఫ్ హాయిగా సాగిపోయి,సెకండ్ హాఫ్ మాత్రం ప్రతి నిముషం ఆసక్తిగా,అంతే వేగంగా  సాగుతుంది.ఫ్యామిలి త్రిల్లర్ అనే కొత్త తరహా సినిమా తీసి నిర్మాతలు మంచి ప్రయత్నం చేసారు.రాంబాబుగా వెంకటేష్ నటన అద్బుతం.ఈ పాత్ర తెలుగులో ఆయన మాత్రమే చెయ్యగలరు అని ప్రతి ఫ్రేములో మనకి అనిపిస్తుంది.ఇక పోలీసాఫీసర్ గా నదియా నటన కూడా గుర్తుండిపోతుంది.ఎత్తుకు పై ఎత్తుగా సాగే సెకండ్ హాఫ్ లో నదియా నటన హాట్సాఫ్.ఎలాంటి చదువుసంధ్యలు లేని మామూలు మధ్యతరగతి వ్యక్తి తన సినిమా పరిజ్ఞానంతో ఒక్క ఆధారం కూడా దొరక్కుండా తన కుటుంబాన్ని ఎలా రక్షించుకున్నాడో భావోద్వేగాల నడుమ అందంగా చూపించిన సినిమా దృశ్యం.

ప్లస్ లు :



·                     కధ 
·                     నటీనటులు
·                     దర్శకత్వం 
·                     నిర్మాతలు 
·                     క్లైమాక్స్ 


మైనస్ లు:

ఇంత మంచి సినిమాలో తప్పులు వెతికే తప్పు నేను చెయ్యను.

TMI సలహా:

కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం.అందరూ తప్పకుండా చూడవలసిన చిత్రం.తెలుగు తెరపై కధలు కనిపించని రోజుల్లో అందమైన కధతో వచ్చిన చిత్రం దృశ్యం.ఇలాంటి సినిమాని ఆదరించి తెలుగు సినిమాల్లో గొప్ప చిత్రాలు రావడానికి పునాది వేద్దాం.




TMI రేటింగ్: 4/5


Comments