చిత్రం : బాద్ షా
డైరెక్టర్ : శ్రీనువైట్ల
నిర్మాత: బండ్ల గణేష్
సంగీత దర్శకుడు: తమన్
పాత్రలు : ఎన్టీఆర్, కాజల్ అగర్వాల్ , బ్రహ్మానందం, ప్రదేప్ రావత్, ఆశిష్ విద్యార్ధి…
కథ :
డాన్ సాధు భాయ్(కెల్లీ దోర్జీ) నేతృత్వంలో జరిగే ఇంటర్నేషనల్ క్రైమ్ ప్రపంచంలో బాద్ షా(ఎన్.టి.ఆర్) యంగ్ అండ్ డైనమిక్ పర్సన్ గా ఎంతో దూకుడుగా దూసుకుపోతుంటాడు. బాద్ షా తండ్రి రంజన్(ముఖేష్ రుషి) సాధు భాయ్ కి చాలా నమ్మకస్తుడు, అలాగే మాకాలో అతనికి బాగా లాభాలు తెచ్చి పెట్టే ఒక కాసినోని రంజన్ చూసుకుంటూ ఉంటాడు. ఇంటర్నేషనల్ క్రైమ్ లో బాద్ షా తన తెలివితేటలతో, ఎంతో డేరింగ్ గా తన లక్ష్యం వైపు దూసుకుపోతున్న టైంలో బాద్ షా కి సాధు భాయ్ కి మధ్య ఒక గొడవ జరుగుతుంది. దాంతో సాదు భాయ్ యంగ్ డాన్ బాద్ షా సామ్రాజ్యాన్ని కూల్చేయాలనుకుంటాడు. సాధు భాయ్ శత్రువులైన డాన్ క్రేజీ రాబర్ట్(ఆశిష్ విద్యార్ధి), వయోలెంట్ విక్టర్(ప్రదేప్ రావత్) తో కలిసి బాద్ షా ని, అతని ఫ్యామిలీని నాశనం చేయాలనుకుంటాడు.
సాధు భాయ్ ఇండియాలోని పలు మెట్రో సిటీలలో భారీ ఎత్తున టెర్రరిస్ట్ అటాక్స్ ప్లాన్ చేస్తాడు. సాధు ప్లాన్స్ ని ఎలాగైనా నాశనం చేయాలనే ఉద్దేశంతో బాద్ షా జానకి(కాజల్), ఆమె తండ్రి జై కృష్ణ సింహా(నాజర్) సహాయం తీసుకుంటాడు. జై కృష్ణ సింహా హైదరాబాద్ సిటీ కమీషనర్, అలాగే తన పెద్ద ఉమ్మడి కుటుంబాన్ని సవ్యంగా చూసుకుంటూ, అందరినీ కంట్రోల్ చేసే స్ట్రిక్ట్ కుటుంబ పెద్ద కూడా, అదే ఫ్యామిలీలో ఒక మెంబర్ పద్మనాభ సింహా(బ్రహ్మానందం). అలా సినిమా జరుగుతున్న సమయంలో బాద్ షా కి తన గతం తెలియడంతో సాధు భాయ్ తో పోరాడి అతని సామ్రాజ్యాన్ని నేలమట్టం చేయడానికి మరో బలమైన కారణం దొరుకుతుంది. ఆ కారణం ఏంటి? అసలు బాద్ షా ఎవరు? బాద్ షా వేసే ప్లాన్స్ కి పద్మనాభ సింహా ఎలా సరిపోయాడు? అనేదే మిగిలిన కథ.
శ్రీను వైట్ల సినిమాల్లో ఎంటర్టైన్మెంట్ ఎక్కువగా ఉన్డుంది.. ఇన్స్ పెక్టర్ పద్మనాభసింహా పాత్రలో బ్రహ్మానందం చేత సూపర్బ్ కామిడి చేపించాడు , ‘డైరెక్టర్ రివేంజ్ నాగేశ్వరరావు’గా ఎంఎస్ నారాయణ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు. ‘ఇన్ సెప్చన్’ నుంచి తీసుకున్న ‘లివింగ్ అవుట్ ఎ డ్రీమ్’ అనే కాన్సెప్ట్ ని శ్రీను వైట్ల బాగా డీల్ చేసారు .
సాంకేతిక వర్గం : సినిమా లో విజువల్ చాలా రిచ్ గా, కలర్ ఫుల్ గా ఉన్నాయి.ఈ సినిమా కోసం నలుగురు సినిమాటోగ్రాఫర్స్ పనిచేసారు. థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది . కొరియోగ్రఫీ చాలా బాగుంది. డైలాగ్స్ చాలా కామెడీగా ఉన్నాయి, వన్ లైన్ పంచ్ డైలాగ్స్ చాలా ఎఫెక్టివ్ గా ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ బాగా రిచ్ గా ఉన్నాయి. సుహాసిని ఎన్టీఆర్ తల్లి పాత్రకు సరిగ్గా సరిపోయింది. సిద్ధార్థ్ ఎంట్రీ చిన్న క్యారెక్టరయినా ప్రాముఖ్యత ఉన్న పాత్ర సిద్ధార్థ్ కూడా పర్వాలేదనిపించాడు. పిల్లి కళ్ల బుల్లోడు నవదీప్ చెడ్డ పోలీస్ పాత్రలో పరిచయం ఫర్వాలేదనిపిస్తాడు .జయప్రకాష్ రెడ్డి, బ్రహ్మాజీ, తనికెళ్ళ భరణి, మాస్టర్ భరత్, చంద్ర మోహన్, తాగుబోతు రమేష్ లాంటి టాలెంట్ నటుల పాత్రలను ఇంకా బాగా తీర్చిదిద్ది ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది .
ప్లస్ : బాద్ షా గా ఎన్.టి.ఆర్ నటన. సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్, బ్రహ్మానందం , ఎన్.టి.ఆర్ జస్టిస్ చౌదరి గెటప్, శ్రీను వైట్ల మార్క్ కామెడీ.
మైనస్ : శ్రీను వైట్ల పాత సినిమాలతో కొన్ని పోలికలు ఉండడం, కొంచెం డ్రాగ్ అయినట్లనిపిస్తుంది.
చివరగా : హాట్స మ్మర్ లో కూల్ కామెడి ఎంటర్టైనర్

Comments