‘జబర్థస్త్’ తెలుగు రివ్యూ
సిద్దార్థ, సమంత జంటగా నటించిన సినిమా ‘జబర్థస్త్’. ఈ సినిమాకు ‘అలా మొదలయ్యింది’ ఫేం నందినిరెడ్డి దర్శకత్వం వహించడం, బెల్లంకొండ సురేష్ నిర్మించడం వంటి కారణాలతో అందరి దృష్టిని విశేషంగా ఆకర్షించింది. మరి ఈ ‘జబర్థస్త్’ ఏలా ఉందో చూద్దాం..!చిత్రకథ : భైర్రాజు [సిద్ధార్థ] బాగా డబ్బులు సంపాదిద్దామని ఆశతో అప్పులు చేసి అనేక వ్యాపారాలు చేస్తాడు. అయితే నష్టాలు రావడంతో అప్పు ఇచ్చినవారు అతన్ని తరముతుంటారు. బైర్రాజు అనుకోకుండా ఒకసారి శ్రేయా [సమంత] బిజినెస్ ఐడియాను విని, దాని ద్వారా ఉద్యోగం సంపాదిస్తాడు. ఊహించని పరిణామాలతో ఉద్యోగం పొగొట్టుకుని, శ్రేయాతో వ్యాపారం ప్రారంభిస్తాడు. ఇద్దరూ దగ్గర అవుతారు అనుకునే సమయంలో భైర్రాజు మాటలు ఇద్దరి మధ్య దూరాన్ని పెంచుతాయి. భైర్రాజు సొంతంగా వ్యాపారం ప్రారంభిస్తాడు... తరువాత జరిగిన పరిణామాలు ఏమిటి.., శ్రేయా-భైర్రాజు ఎలా దగ్గర అయ్యారు అనేది చిత్ర కథాంశం.
నటీనటుల ప్రతిభ : హీరో సిద్ధార్థ ఈ సినిమాతో తన కెరీయర్ లో తొలిసారిగా ఫుల్ మాస్ క్యారెక్టర్ చేశాడు. ఫైట్లు చేయకపోయినా, వచ్చి రాని ఇంగ్లీష్ మాట్లాడ్డం, లుంగీ పైకైత్తి డ్యాన్సులు చేయడం.. వంటి లక్షణాలతో కూడిన పాత్రను బాగా పండించాడు. కామెడీ నిండిన డైలాగులతో అదరగొట్టాడు. చివరిలో సెంటిమెంట్ కూడా పండించాడు. సమంత చాలా చలాకీ అయిన పాత్రలో నటించింది. ముఖ్యంగా పెళ్లి చూపులతో సమంత పరిచయ సన్నివేశం ఆమె నటన లోని కొత్త కోణాన్ని చూపించింది. పాటల్లో గ్లామర్ తో రాణించిన సమంత ఈ సినిమాల్లో కనిపించిన అన్ని సన్నివేశాల్లోనూ మంచి నటన ప్రదర్శించింది. నిత్యామీనన్ ప్రత్యేక పాత్రలో నటించింది. ఊహించలేని పాత్రతో నిత్యామీనన్ అధ్బుతంగా ఆకట్టుకుంది. ఏ పాత్రలోనైనా రాణించే నటి నిత్యామీనన్. ఆమెకు వేసిన గెటప్ లు కూడా బాగున్నాయి. షియాజీ షిండే పాత్ర నవ్వులు పండిస్తుంది. తాగుబోతు రమేష్, తెలంగాణ శకుంతల పాత్రలు రోటిన్ గా అనిపించినా అలరిస్తాయి. మిగిలిన వారు తమ పాత్రల పరిధిలో నటించారు.
సాంకేతిక వర్గం పనితీరు : ఫోటోగ్రఫీ సాధారణంగా ఉంది. మ్యూజిక్ బాగుంది. పాటలు, వాటి చిత్రీరణ కూడా ఆకట్టుకుంటాయి. మాటలు సరదాగా సాగాయి. నిర్మాణ విలువలు అంత గొప్పగా లేవు. శ్రీహరి-మలేషియా సీన్లు చాలా సాధారణంగా ఉన్నాయి. ‘అలా మొదలయ్యింది’ చిత్రంతో ప్రేమ కథతో ఆకట్టుకున్న నందిని రెడ్డి ఈసారి ఎంటర్ టైన్మెంట్ కథాంశంతో సినిమా రూపొందించారు. లేజిక్ లు గురించి ఆలోచించకుండా సినిమాను ఆహ్లదంగా నడిపారు. కథ లేకపోయినా వినోదంపైనే భారం వేసి సినిమాను నడిపించారు. అక్కడ అక్కడ బోర్ కొట్టించినా హాస్యం, పాటలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి సినిమాను ముగించారు.
హైలెట్స్ :
- సిద్ధార్థ
- సమంత
- నిత్యామీనన్
- నటన
- మాటలు
- పాటలు
- సాధారణ కథ
- ఊహించే ముగింపు
చివరగా : కామెడీ జస్ట్ కామెడి.
Comments